![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -136 లో..... మహాని ఆఫీస్ లో ఎవరో తిట్టారని చక్రి తప్పుగా అర్థం చేసుకొని వెంటనే తను పనిచేసే ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ రౌడీలాగా ప్రవర్తిస్తుంటే మహాకి కోపం వచ్చి బయటకు లాక్కొని వచ్చి తనపై అరుస్తుంది. ఇలా నేను పని చేసే చోటికి వచ్చి గొడవ చెయ్యమని ఎవరు చెప్పారని కోప్పడుతుంది. అసలు నీకు ఏం రైట్ ఉందని ఇక్కడికి వచ్చావని చక్రిని మహా అడుగుతుంది. చక్రి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మహా లోపలికి వెళ్తుంది. అతను ఎవరని విక్కీ అడుగుతాడు. నేను వాళ్ళింట్లోనే ఉంటాను.. ఫోన్ లో సంతోష్ సర్ ఎవరినో తిడుతుంటే నన్ను అనుకున్నాడని మహా చెప్తుంది.
నిన్ను వర్క్ బాలేదని తిట్టానా అని విక్కీ అడుగుతాడు. సైలెంట్ విక్కీ ఇప్పటికే ఎంబరిసింగ్ గా ఉంది తనకి అని దివ్య అంటుంది. ఇక్కడిది ఇక్కడే వదిలెయ్యాలి ఇంట్లోది ఇంట్లోనే వదిలెయ్యాలని విక్కీ అంటాడు. మరొకవైపు ఏంటే కేశవ నీతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నా.. నువ్వు ఎందుకు పట్టించుకోవడం లేదు.. అతన్ని వదిలేసావా అని శైలుని తన ఫ్రెండ్ అడుగుతుంది. లేదే నా చుట్టూ తిరిగేలా చేసి అప్పుడు నా ప్రేమ విషయం చెప్తానని శైలు అంటుంది.ఆ తర్వాత చక్రి ఇంటికి వస్తాడు. ఇక ఆఫీస్ లో ఎవరు మీ జోలికి రారని చక్రి అంటుంటే.. అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు.. చేసింది తప్పన్న ఫీలింగ్ లేదని, ఏం లేదా అని అంటుంది. తర్వాత మహా జరిగింది మొత్తం మాధవ, కన్నాలకి చెప్తుంది. కాసేపటికి కేశవ వస్తాడు. తనకి జరిగింది మొత్తం కన్నా చెప్తాడు. ఏంట్రా అసలు నువ్వేం అనుకుంటున్నావు.. ఎందుకు ఆఫీస్ కి వెళ్లి గొడవ చేసావని కేశవ అడుగుతుంటే.. నీకేంట్రా బండోడా.. నీతో ఏ అమ్మాయి అయినా మాట్లాడుద్దా....నువ్వు కూడా చెప్తున్నావని చక్రి అడుగుతాడు. ఏం అన్నావ్ రా అని చక్రి కాలర్ పట్టుకుంటాడు. కేశవ, చక్రి ఇద్దరికి గొడవ అవుద్ది.. మాధవ గొడవని ఆపుతాడు. చక్రి కోపంగా ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే.. నారాయణ ఎదురుపడి ఇంకా కోపం వచ్చేలా మాట్లాడతాడు. దాంతో చక్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు
ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటారు. చక్రి ఎక్కడ అని మహా అడుగుతుంది.వాడికి అలవాటే అలిగి వెళ్లిపోవడమని కేశవ అంటాడు. మాధవ ఫోన్ చేస్తుంటే చక్రి కట్ చేస్తాడు. ఆ తర్వాత రాత్రి చక్రి కార్ లో పడుకొని.. నాకు ఫోన్ ఎవరు చెయ్యట్లేదని బాధపడతాడు. కార్ లోనే పడుకుంటాడు చక్రి. ఉదయం ఇంకా చక్రి రాకపోయేసరికి చక్రికి మహా ఫోన్ చేసి ఇంటికి రా అని అంటుంది. అనడం వాళ్ళ వంతే రమ్మనడం వాళ్ళ వంతే అని చక్రి అనుకొని ఇంటికి బయల్దేరతాడు. తరువాయి భాగంలో చక్రి ఎవరికో ఆక్సిడెంట్ చేశాడని అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. దాంతో మాధవ, మహా స్టేషన్ కి వచ్చి ఇన్‌స్పెక్టర్ తో మాట్లాడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |